Andhra Tractors

Andhra Tractors Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Andhra Tractors, Automotive, aircraft & boat, Guntur.

👇రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తులు👇👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు శుక్రవారం (ఆగస్ట్ 1)  నుంచి ...
03/08/2025

👇రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డులకు దరఖాస్తులు👇

👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచి ఈ నెల 8 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డివిజన్ స్థాయిలో 11న పరిశీలించి ఒక్కో కేటగిరీకి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. ఆ జాబితాను జిల్లా విద్యాధికారికి 12న అందిస్తారు. ఒక్కో కేటగిరీకి ఒకరు చొప్పున తుది జాబితాను...14న జిల్లా స్థాయి కమిటీలో రూపొందిస్తారు. దీన్ని 16న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 21 నుంచి 23 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది జాబితాను 25న ఖరారు చేస్తారు. ఎంపికైన వారికి సెప్టెంబరు 5న రూ.20వేల నగదు, ప్రశంస పత్రం, పతకం అందిస్తారు. జిల్లా స్థాయిలో 30 మంది, మండల స్థాయిలో 10 మందికి మించకుండా అవార్డులకు ఎంపిక చేయాలని డైరెక్టరేట్ ఆదేశించింది.

👉 ఉత్తమ పని తీరు కనబరిచిన ఉపాధ్యాయులకు ఉత్తమ టీచర్ అవార్డు ఇస్తారు. ఇందుకోసం జిల్లాకు 16 మంది చొప్పున రాష్ట్ర స్థాయిలోనే ఎంపిక చేసి, ఆ జాబితాను జిల్లాకు పంపిస్తారు. అక్కడ పరిశీలించి తిరిగి రాష్ట్ర స్థాయికి పంపించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూల తర్వాత 104 మందిని ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు చేయకపోయినా ఉత్తమ టీచర్ తరఫున ఎవరైనా ఈ అవార్డుకు ఐదుగురు టీచర్లు సిఫార్సు చేసేందుకు అవకాశం కల్పించారు.

*అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా?  స్టేటస్ చెక్ చేసుకోండి*ప్రభుత్వం నిన్న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. 46.85 లక...
03/08/2025

*అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా? స్టేటస్ చెక్ చేసుకోండి*

ప్రభుత్వం నిన్న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది. 46.85 లక్షల మంది రైతులకు గాను 44.75 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపింది. 9552300009 వాట్సాప్ నంబర్ కు HI అని మెసేజ్ చేయాలి. సేవల్లో అన్నదాత సుఖీభవపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే డబ్బులు పడిన స్టేటస్ తెలుస్తుంది. వెబ్ సైట్ annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు.

03/08/2025

ఏపీలో కొత్త రోడ్లకు గడ్కరీ గ్రీన్ సిగ్నల్

APలోని పలు రోడ్ల విస్తరణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

₹2600 కోట్లతో
విజయవాడ-మచిలీపట్నం 6 లేన్లు,

₹2605crతో
వినుకొండ-గుంటూరు 4 లేన్లు,

₹2000crతో
గుంటూరు-నిజాంపట్నం 4 లేన్లు,

₹4200crతో
బుగ్గకయిప-గిద్దలూరు 4 లేన్లు,

₹2500crతో
ఆకివీడు-దిగమర్రు 4 లేన్లు,

₹4200crతో
పెడన-లక్ష్మీపురం 4 లేన్లు,

₹1182crతో
ముద్దనూరు-కడప 4 లేన్ల విస్తరణ పనులను ఈ
ఏడాదే ప్రారంభిస్తామని వెల్లడించారు...

Address

Guntur
522001

Website

Alerts

Be the first to know and let us send you an email when Andhra Tractors posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share