మణికంఠ మెకానిక్ వర్క్స్ చొప్పదండి

  • Home
  • India
  • Choppadandi
  • మణికంఠ మెకానిక్ వర్క్స్ చొప్పదండి

మణికంఠ మెకానిక్ వర్క్స్ చొప్పదండి Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మణికంఠ మెకానిక్ వర్క్స్ చొప్పదండి, Motorcycle repair centre, Hi way Road beside sairathna Bakery And Sweets, Choppadandi.

11/04/2024
14/01/2024
12/11/2023

* #దీపావళి శుభాకాంక్షలు #*

చెడుపై మంచి గెలుపుకు ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారు. చీకట్లను చెరిపేస్తూ వెలుగులను నింపే ఈ పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ప్రత్యేకం. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు *దీపావళి* చేసుకుంటారని *పురాణాలు* చెబుతున్నాయి. ఈ పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆశిస్తూ.. *మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.*
*సామల వేణుగోపాల్*
*మణికంఠ*మెకానిక్ వర్క్స్* *చొప్పదండి*

01/10/2023

మన తెలుగు యువతి, యువకులకు
WORK FROM HOME

పట్టుదల మరియు కష్టపడే తత్వం మీలో ఉంటే మీరు గెల్చినట్టే .అయితే అలాంటివారికి ఒక గొప్ప అవకాశం ఇంటి వద్దే కూర్చొని ఎంతైనా సంపాదించుకోవచ్చు...

ఈ పని చేయటానికి 18+ఉండాలి
Housewifes,Students, Employees,Retiredpersons, Unemployeds వారికి ఉపయోగపడే గొప్ప అవకాశం.

కాంటాక్ట్ నెం:9848299282
https://rb.gy/a12c1

13/08/2023

*August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..? ఖచ్చితంగా అన్ని తెలిసిన మేధావులం.. తెలిసి తప్పు చేయొద్దు తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దుదాం..మరచిపోవద్దు*

ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.

అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.

*ఆ తేడా ఏమిటో తెలుసుకుందాము*👇

👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
*ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.* మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.

👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.
( *గమనిక*: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).

దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.

స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.
అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే..

👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను *ఎగురవేస్తారు*(Flag Hoisting).
👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను *ఆవిష్కరిస్తారు*(Flag Unfurling) .

ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.

👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం *ఎర్రకోటలో* జరుగుతుంది.

👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు *రాజ్‌పథ్‌లో* జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).

కావున ఈ information ను share చేసి మన వాళ్లకి అవగాహన కల్పించడం మన బాధ్యతగా భావించండి. ముఖ్యంగా విద్యార్దులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
భారత్ మాతా కీ జై....🇮🇳🇮🇳🇮🇳...

16/10/2022

బాధ్యత

రైల్వే స్టేషన్ లో రైలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు.

ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూచున్నారు.

పక్కన ఒక వృద్ధ జంట కూచున్నారు.ఆయన ఎదో పుస్తకం చదువుతున్నారు.

ఎక్కడి వరకు వెళ్తున్నారు మాట కలిపాడు మద్య వయసాయన.మేము విజయవాడ వెళుతున్నాం.
మరి మీరో అంటూ అడిగాడు ఆ వృద్ధుడు అతన్ని .
మేమూ విజయవాడ వరకే అని చెప్పి మీకు రిజర్వేషన్ వుందా అని అడిగాడు మద్యవయసాయన.
ఆ ఉందండీ మా అబ్బాయి చేశాడు. S5 లో చెప్పాడు పెద్దాయన.

అరే మాది కూడా S5 బోగీనే అన్నాడు, వాళ్ళవి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు.

'ఆ పుస్తకం ఏమిటండీ అడిగాడు' మద్యవయసాయన, ఆ పెద్దాయనని
పుస్తకం అట్ట చూపిస్తూ "రామాయణం"
చెప్పాడు పెద్దాయన.
'ఇపుడు ఎంత వరకు చదివారు' అడిగాడు మధ్యవయసాయన.

'సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు.'

'ఆ అవన్నీ ఈ వయసులో ఇపుడు నాకు ఎందుకు లెండి రిటైర్ అయ్యాక తీరిక గా చదువుకుంటా' అన్నాడు మద్యవయసాయాన. ఆ వృద్ధుడు నవ్వి మళ్లీ పుస్తకం చదవటం లో మునిగిపోయాడు.

రైలు ఇక్కడ 3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది.
జనాలు కాస్త ఎక్కువగానే వున్నారు.త్వరగా రైలు ఎక్కేయాలి పిల్లలు, జాగ్రత్త, ఆ లగేజి అంతా ఒకేచోట పెట్టు. అటు ఇటు వెళ్లకండి. రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు. బొమ్మల్లా కూర్చోకుండా నా వెంటే రండి....
అంటూ భార్య కీ ఆదేశాలు జారీ చేస్తున్నాడు మథ్యవయసాయన.

మరి కాసేపట్లో రైలు వచ్చింది.
లగేజీ తీసుకుని రా రా అలా నిలబడిపోతవేంటి అని భార్యను అరుస్తూ ముందుకు కదిలాడు మద్యవయసాయన. జనాలని తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేసాడు. వెనకే భార్య పిల్లలు వస్తున్నారులే అనుకున్నాడు.

తీరా ఎక్కి చూశాక భార్య, పిల్లలు కనపడలేదు,
లగేజి బెర్త్ మీద పెట్టి, పెద్దాయన కి లగేజి చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూసాడు. ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడం లోనే వున్నారు. అంతలో రైలు కూత పెట్టింది. కసురుకుంటూ భార్య చేయిని పట్టుకుని లోపలికి లాగేసాడు. పిల్లలని కూడా లోనికి లాగేసాడు.

అంతటితో ఆగకుండా ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకు రాను. లోక జ్ఞానం లేదు, నీకు రైలు ఎక్కడం కూడా రాదా, నా వెంటే ఎక్కు అంటే వినపడదా.
నిన్ను కాదు మీ నాన్నని అనాలి. నిన్ను నాకు అంటగట్టారు అని గెట్టిగా అరుస్తున్నాడు. రైలు కదిలింది.

కాసేపటికి ఆయన శాంతించాడు. వాళ్ళ ఎదురు బెర్త్ లో కూచున్న వృద్ధుడు మళ్లీ రామాయణం చదవటం మొదలు పెట్టాడు.

'ఏముందండి ఆ పుస్తకం లో ఎప్పుడో జరిగిందట, రాసారట, ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇంకా ఆ పుస్తకం పట్టుకుని చదువుతున్నారు,' అన్నాడు మద్యవయసాయన.

పెద్దాయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి,

"ఇందాక రైలు ఎక్కేపుడు మీరు ఎంత కంగారు పడ్డారు. మీ భార్య, పిల్లలు, లగేజీ ని రైలు ఎక్కించటానికి కాస్త ప్రయాస పడ్డారు. నేను, నా భార్య కాస్త ముసలి వాళ్ళం అయినా కూడా మేము హడావిడి లేకుండా రైలు ఎక్కేసాం."

"ఫ్లాట్ ఫారం మీద వున్నపుడు మీరు అడిగారు, పుస్తకం ఏమిటి అని. నిజానికి నేను రామాయణం మొదటి సారి చదువుతున్నాను. సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు. అక్కడ మద్యలో గుహుడు కలిశాడు అని చెప్పాను."

"అవును, గుహుడు పడవలో వాళ్ళను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు చేర్చాడు" అంతేగా ఏముంది అందులో అన్నాడు మద్యవయసాయన.

"ఆ ఆ అంతే కాకపోతే, ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది, తరువాత లక్ష్మణుడు ఎక్కాడు, ఆఖరున రాముడు ఎక్కాడు. తరువాత పడవ ముందుకు కదిలింది. ఈ వృత్తాంతం అంతా నేను ఫ్లాట్ ఫారం మీదనే చదివాను. ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వారిని బాగా చూసుకోవాలి. తరువాత మన గురించి మనం ఆలోచించాలి. అని దాని భావం. అందుకే రైలు ఎక్కెటపుడు ముందు నా భార్యని ఎక్కించా, లగేజి తీసుకుని తన వెనక నేను ఎక్కేసా... మనం ఎలా బతకాలి అని ఏ టెక్నాలజీ మనకి చెప్పదు" అన్నాడు పెద్దాయన. ఇలాగే మహాగ్రంథాలలో మనకు జీవన విధానాన్ని, నైతిక విలువలను నేర్పించే సంఘటనలు ఉంటాయండి, వాటిని మన పరిస్థితులకు అన్వయించుకుంటే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇలాంటి పుస్తకాల్లో దొరుకుతాయి, టెక్నాలజీ ఎంతపెరిగినా జీవనవిధానంలో ఎంత మార్పు వచ్చినా, సరైన పద్దతిలో జీవించేందుకు టెక్నాలజీ కన్నా మన నడవడిక మాత్రమే ముఖ్యం, ఆ నడవడిక ఎలా ఉండాలో చెప్పేవే మహాగ్రంథాలు, ఈ పుస్తకాలు లైఫ్ టైం అప్ డేటెడ్ అంటూ వివరించారు పెద్దాయన.

Address

Hi Way Road Beside Sairathna Bakery And Sweets
Choppadandi
505415

Opening Hours

Monday 9am - 5pm
6pm - 8pm
Tuesday 9am - 5pm
6pm - 8pm
Wednesday 6pm - 8pm
Thursday 9am - 5pm
6pm - 8pm
Friday 9am - 5pm
6pm - 8pm
Saturday 9am - 5pm
6pm - 8pm
Sunday 9am - 5pm
6pm - 8pm

Telephone

9848299282

Website

Alerts

Be the first to know and let us send you an email when మణికంఠ మెకానిక్ వర్క్స్ చొప్పదండి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to మణికంఠ మెకానిక్ వర్క్స్ చొప్పదండి:

Shortcuts

Share